Anand Mahindra : ఈ ట్రాక్టర్ ఎందుకిలా ఉంది? ఈ డౌట్ ఆనంద్ మహీంద్రాకే కాదు మీకూ వస్తుంది

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈసారి ఆయన పోస్ట్ చేసిన ఓ ట్రాక్టర్ వీడియో చాలా ఆసక్తికరంగా మారింది.

Anand Mahindra : ఈ ట్రాక్టర్ ఎందుకిలా ఉంది? ఈ డౌట్ ఆనంద్ మహీంద్రాకే కాదు మీకూ వస్తుంది

Anand Mahindra

Anand Mahindra : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆసక్తికరమైన విషయాలు పోస్ట్ చేస్తూ అందరికి టచ్‌లో ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ట్రాక్టర్ వీడియో వైరల్‌గా మారింది.

Leopard : టాటా పవర్ కాంప్లెక్సులోకి వచ్చిన చిరుతపులి…భయాందోళనల్లో ఉద్యోగులు…వీడియో వైరల్

మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు కొత్తగా కనిపించే వాహనాలంటే చాలా ఇష్ట పడతారు. అలాంటి వాహనాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటి తయారీ, ఇంజనీరింగ్,పని తీరులను ప్రశంసిస్తుంటారు. తాజాగా మహీంద్రా షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. రెగ్యులర్‌గా మనం చూసే ట్రాక్టర్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కనిపించే ట్రాక్టర్ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Anushka Sharma Viral Post : భర్త కోహ్లీపై అనుష్కా శర్మ తాజా కామెంట్… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు

‘ఆసక్తికరంగా ఉంది.. కానీ నాకు ఒక డౌట్.. ఎందుకిలా ఉంది?’ అనే శీర్షికతో ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ట్రాక్టర్ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి సుమారు 7 అడుగుల ఎత్తులో ఉన్న సీటుపై కూర్చుని ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఎత్తుగా ఉన్న సీటు స్ధానానికి అనుగుణంగా స్టీరింగ్ ఏర్పాటు చేశారు. దీని తయారీ విధానంలో నైపుణ్యం కనిపిస్తున్నా ఈ విధంగా ఎందుకు తయారు చేసారన్నది మాత్రం అర్ధం కాలేదు. ఆనంద్ మహీంద్రా తన పోస్టులో కూడా ఇదే ప్రశ్నను అడిగారు. ఈ వీడియోపై నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహుశా అతను ఎత్తైన పంట పొలంలో ఈ ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నాడేమో? అని కొందరు.. ఇతర ట్రాక్టర్ల కంటే రెండు అడుగులు ముందు ఉండాలనుకుంటున్నాడేమో? అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఈ ట్రాక్టర్ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.