Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వీడియో.. అందులో ఏముందంటే?

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌లు, ఎంగేజింగ్ స్టోరీల పోస్టు చేస్తూ యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆయనను ఓ వీడియో బాధించింది. ఆ వీడియోలో ఏముంది?

Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వీడియో.. అందులో ఏముందంటే?

Anand Mahindra

Anand Mahindra : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన ఓ వీడియో చూసి బాధపడ్డారు. అంతేకాదు బాధ్యతగా వ్యవహరించారు. ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Anand Mahindra : ఈ ట్రాక్టర్ ఎందుకిలా ఉంది? ఈ డౌట్ ఆనంద్ మహీంద్రాకే కాదు మీకూ వస్తుంది

ఆనంద్ మహీంద్రాకు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ట్రెండింగ్ టాపిక్‌లు, ఎంగేజింగ్ స్టోరీలతో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని సముద్రంలో చెత్తను డంప్ చేస్తున్న కొందరు వ్యక్తుల వీడియోను చూసి స్పందించారు. ‘ఇది చూస్తుంటే చాలా బాధగా ఉంది. మనుషులు తమ పద్ధతి మార్చుకోకపోతే మౌళిక సదుపాయాలు ఎంత మెరుగుపడినా నగర జీవితంలో నాణ్యతను కనిపించదు’ అనే శీర్షికతో పోస్ట్ చేయడమే కాకుండా తన పోస్ట్‌ను గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు.

Anand Mahindra : చిన్నతనంలో జాతరలో విడిపోయాం.. ఓ ఫోటోపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఆనంద్ మహీంద్రా పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో బృహన్‌ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్, ముంబయి పోలీసులు చెత్త వేసిన వ్యక్తుల కోసం వెతుకులాట ప్రారంభించారు. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర కనిపించిన టాక్సీని ట్రాక్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని గుర్తించి రూ.10,000 జరిమానా విధించారు. ఇక ఈ పోస్టుపై నెటిజన్లు ‘అన్ని నగరాల్లో చెత్తను పారవేసేందుకు సులువైన యాక్సెస్ ఏర్పాటు చేయాలని.. వ్యర్థాలను పారవేయడం గురించి టీవీ, సోషల్ మీడియా, హోర్డింగ్ ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని’ డిమాండ్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్ అవుతోంది.