గణేశ విగ్రహాల నిమజ్జనాలు.. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కీలక ప్రకటన.. అర్ధరాత్రైనా ఇక హ్యాపీగా జర్నీ..

గణేశుల విగ్రహాలను చూసేందుకు హుస్సేన్ సాగర్ కు లక్షలాది మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్.

గణేశ విగ్రహాల నిమజ్జనాలు.. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కీలక ప్రకటన.. అర్ధరాత్రైనా ఇక హ్యాపీగా జర్నీ..

Metro Train

Updated On : September 5, 2025 / 2:40 PM IST

Hyderabad Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో శనివారం గణేశ విగ్రహాల నిమజ్జనాలు జరగనున్నాయి. గణేశ్ శోభయాత్ర కార్యక్రమాలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులను నడపనుంది.

ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటలకు మెట్రోట్రైన్లు ప్రారంభమవుతాయి. చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటిగంటకు అన్ని టెర్మినల్‌ స్టేషన్ల నుంచి బయలు దేరుతుంది. (Hyderabad Ganesh Immersion 2025)

ఖైరతాబాద్ గణేశ్‌తో పాటు ఇతర గణేశుల విగ్రహాలను చూసేందుకు హుస్సేన్ సాగర్ కు లక్షలాది మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది హైదరాబాద్ మెట్రో రైల్.

Also Read: Mumbai: ఉగ్ర కలకలం? 34 వాహనాల్లో “మానవ బాంబులు”.. భారత్‌లోకి 14 మంది ఉగ్రవాదులు వచ్చారంటూ మెసేజ్‌

నగరవాసులు మెట్రో సేవలను సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులు అన్నారు. కాగా, శనివారం మధ్యాహ్నం ఒంటి గంట లోపే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఉంటుందని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

ప్రతి ఏరియాపై మ్యాప్ వేసుకుని రూట్స్ ను నిర్ణయించినట్లు చెప్పారు. 29 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం దాదాపు 50,000 విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని అన్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-27852482, 8712660600, 9010203626.