Dussehra Celebrations : కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో కేసీఆర్.. ప్రత్యేక పూజలు.. వీడియో

Dussehra Celebrations : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దసరా వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

Dussehra Celebrations

Dussehra Celebrations : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దసరా వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. వేద పండితులు సమక్షంలో వాహన పూజ, ఆయుధ పూజలు నిర్వహించారు. అనంతరం శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు.

Also Read : Abhijeet Dipke : దీపావళి వరకు నిరసనలకు బ్రేక్.. కార్యకర్తలకు అభిజీత్ దీప్కే కీలక విజ్ఞప్తి.. కారణమిదే..!

దసరా వేడుకల్లో కేసీఆర్ తోపాటు కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు రావు పాల్గొన్నారు. అంతేకాక పలువురు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో నిర్వహించిన పూజలతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.