Telangana Gurukul Schools : తెలంగాణలోని గురుకుల విద్యార్థులకు బిగ్ అప్డేట్.. యూనిఫాంలు నెలరోజుల తరువాతే.. కారణాలివే..?
telanana gurukul schools : రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి అందించాల్సిన ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
- Harish Thanniru
- Updated on- June 13, 2026 / 07:39 AM IST
Education kits and uniforms delay in telanana gurukul schools
- తెలంగాణలోని గురుకుల విద్యార్థులకు బిగ్ అప్డేట్
- ఎడ్యుకేషన్ కిట్ ఆలస్యం
- ఈ నెలాఖరు నాటికి విద్యార్థులకిచ్చే అవకాశం
telanana gurukul schools : రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠశాలల ప్రారంభం రోజునే ఎడ్యుకేషన్ కిట్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం కిట్ ల పంపిణీలో ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెండర్ల ఖరారు, ధరలపై సంప్రదింపులు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతలో జాప్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని, టెండర్లలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ఈ నెలాఖరు నాటికి యూనిఫాం మినహా ఎడ్యుకేషన్ కిట్ లోని వస్తువులను విద్యా సంస్థలకు సరఫరా అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : telangana Rain alert : తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాల హెచ్చరిక.. హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు అలర్ట్
రాష్ట్రంలోని గురుకులాల్లో 5,6,7 తరగతుల విద్యార్థినులకు స్కర్ట్‌లు, షర్ట్‌లు, 8వ తరగతి పైబడిన విద్యార్థినులకు పంజాబీ డ్రెస్సులు, బాలురకు షర్ట్‌లు, ప్యాంట్లు అందించాలని నిర్ణయించారు. విద్యార్థుల కొలతలు సేకరించడం, దుస్తుల తయారీ పంపిణీ ప్రక్రియ పూర్తవ్వడానికి సమయం పడుతుందని తెలుస్తోంది. సంక్షేమ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. యూనిఫాంలు మినహా ఎడ్యుకేషన్ కిట్లలోని ఇతర వస్తువులు ఈ నెలాఖరులోపు విద్యాసంస్థలకు చేరే అవకాశం ఉంది. యూనిఫాం మాత్రం జులైలో విద్యార్థులకు చేరుతుందని పేర్కొంటున్నారు.
యూనిఫాం వస్త్రాలు, బ్లాంకెట్లు, కార్పెట్లు, నోటు పుస్తకాలు, ఐడీ కార్డులు, టైలు, బెల్టుల సరఫరా బాధ్యతలను వివిధ ప్రభుత్వ సంస్థలకు అప్పగించారు. యూనిఫాం వస్త్రాలు, బ్లాంకెట్లు, కార్పెట్ల సరఫరాలో 25శాతం ఆర్డర్లను టెస్కోకు, నోటు పుస్తకాల సరఫరాలో 25శాతం బాధ్యతలను ట్రేడింగ్ కార్పొరేషన్ కు, ఐడీ కార్డులు, టైలు, బెల్టులు సరఫరాలో 25శాతం బాధ్యతను లెదర్ పరిశ్రమల అభివృద్ధికి సంస్థకు అప్పగించారు. ఆయా సంస్థల నుంచి సరఫరా పూర్తయిన తరువాత విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిసింది.
