×
Ad

KTR: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదే..! మళ్లీ కేసీఆర్‌ను గెలిపించండి- కేటీఆర్

నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.

KTR: మరోసారి సీఎం రేవంత్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. నాగర్ కర్నూల్ జిల్లాలో మాట్లాడిన కేటీఆర్.. ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. భీమవరం బుల్లబ్బాయ్ అని రేవంత్ రెడ్డికి కొత్తపేరు పెట్టారు కేటీఆర్. కోస్గి సభలో అన్ని బూతులే మాట్లాడారని ధ్వజమెత్తారు. నేను ఆంధ్రలో చదివితే మీకు ఏం నొస్తుందని ప్రశ్నించారు. మీ అల్లుడిని ఆంధ్ర నుంచి తెచ్చుకోలేదా? అని సీఎం రేవంత్ ని అడిగారు కేటీఆర్.

నా మీద ఎందుకు ఏడుస్తున్నారు? నేను అమెరికాలో చదివినా, నా బాత్ రూమ్ నేను కడుకున్నా, మీకేం బాధ స్వామి? రేవంత్ కు ఒర్రెది ఒక్కటే తెలుసు. శపథాలు పథకాలపై చెయ్యండి. రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చింది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కుతున్నారు. చెప్పులు లైన్ లో పెడుతున్నారు. హామీలు ఇచ్చి మోసం చేశారు. కేసీఆర్ కు పేరు వస్తుందని పాలమూరు-రంగారెడ్డి పూర్తి చెయ్యలేదు. త్వరలో పాలమూరుకు కేసీఆర్ వస్తున్నారు.

పాలమూరు-రంగారెడ్డి 90శాతం పూర్తయింది. 10 శాతం పూర్తి చేయడానికి రేవంత్ కి చేతకావడం లేదు. నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. వంగూరు మండలంలో బీఆర్ఎస్ దే హవా. కార్యకర్తలు, నాయకుల మధ్య సమయనం లేకపోవడంతోనే గత ఎన్నికల్లో ఓటమి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను పండబెట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇదే హవా కొనసాగాలి.

బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం సర్పంచ్ లందరికీ నిధులు వస్తాయి. మళ్లీ కేసీఆర్ ను గెలిపించండి. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకుందాం” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read: కేసీఆర్ ఈ సారి అసెంబ్లీకి వెళ్తారా? సభకు అటెండ్‌ అయ్యేందుకే ఇలా చేస్తున్నారా?