Sankranthi holidays : విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే? ఈసారి అదనంగా సెలవులు..
Sankranthi holidays : తెలంగాణలో విద్యా సంస్థలకు సంక్రాంతి పండుగ సెలవుల తేదీలు ఖరారయ్యాయి. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..
Sankranthi holidays
Sankranthi holidays : సంక్రాంతి పండుగ వస్తుందంటే విద్యార్థుల ఆనందానికి అవదులు ఉండవ్. ఎందుకంటే.. సంక్రాంతి పండుగకు విద్యా సంస్థలకు సెలవులు రావడంతోపాటు.. స్నేహితులతో ఆటపాటలతో సరదాగా గడిపే అవకాశం వస్తుంది. దీంతో జనవరి నెల మొదలైందంటే చాలు సంక్రాంతి సెలవులకోసం విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. అయితే, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులను ప్రకటించింది.
Also Read : Rythu Bharosa : తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. రైతుభరోసా నిధులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సెలవుల అనంతరం జనవరి 19వ తేదీ (సోమవారం) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అయితే, తెలంగాణలో మాత్రం సంక్రాంతి పండుగ సెలవులపై గందరగోళం నెలకొంది.
సంక్రాంతి పండుగకు విద్యా సంస్థల సెలవులపై సందిగ్దత నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు 2025-26 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం.. సంక్రాంతి పండుగ సెలవులు జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు ఖరారు చేశారు. అయితే, ఆ సమయంలో జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉంటాయని అధికారులు భావించి ఆ మేరకు సెలవుల తేదీలను ఖరారు చేశారు. అయితే, ప్రస్తుతం పండుగల తేదీలు మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది.
వాస్తవానికి ఈ జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను అమలు చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ, 16వ తేదీన కనుమ పండుగ వస్తుండంతో సెలవుల తేదీల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించినట్లు తెలిసింది. జనవరి 17వ తేదీన శనివారం పాఠశాలలు తిరిగి పున: ప్రారంభం అవుతాయి. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
