×
Ad

Fire Accident : హైదరాబాద్‌లో మళ్లీ మంటల కలకలం.. సికింద్రాబాద్ రైల్ నిలయం దగ్గర అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ లోని రైలు నిలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్ నిలయం ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర ఖాళీ స్థలంలో మంటలు అంటుకున్నాయి. అవి క్షణాల్లోనే భారీగా చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది.

  • Published On : February 9, 2023 / 12:24 AM IST

Fire Accident : హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మంటలు చెలరేగడం ఆందోళనకు గురి చేస్తోంది. సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం నగరవాసులను బెంబేలెత్తించింది. ఆ తర్వాత కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి.

Also Read..Nampally Exhibition Fire : హైదరాబాద్‌లో మరోసారి మంటల కలకలం.. నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర తప్పిన భారీ ప్రమాదం

తాజాగా సికింద్రాబాద్ లోని రైలు నిలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్ నిలయం ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర ఖాళీ స్థలంలో మంటలు అంటుకున్నాయి. అవి క్షణాల్లోనే భారీగా చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. అయితే, ఖాళీ స్థలంలో కొన్నేళ్లుగా చెత్తా చెదారం పేరుకుపోయింది. చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read..Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు