Ramchander Rao Arrest: గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత.. బీజేపీ అధ్యక్షుడి రాంచందర్ రావు అరెస్ట్.. రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడి రాంచందర్ రావు(Ramchander Rao Arrest) అరెస్ట్ చేసిన పోలీసులు.

Gandhi bhavan muttadilo issue BJP President Ramchander Rao arrested

  • నాంపల్లి బిజెపి వద్ద ఉద్రిక్తత
  • అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
  • గాంధీ భవన్ ముట్టడి భగ్నం

Ramchander Rao Arrest: హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao Arrest)నేతృత్వంలో గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.

Revanth Reddy: నేరుగా ఎదుర్కొనే దమ్ములేదు.. అందుకే ఈ కుట్రలు.. బీజేపీ-బీఆర్ఎస్ లపై సీఎం రేవంత్ ఫైర్!

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీ భవన్ వైపు దూసుకెళ్తున్న క్రమంలో పోలీసులు ప్రవేశించి శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర నెట్టివేత, తోపులాట జరిగింది. పరిస్థితులు చేయిదాటిపోకుండా పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు పలువురు కీలక నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

రాంచందర్ రావు అరెస్టు వార్త తీవ్ర సంచలనం సృష్టించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యను ఖండిస్తూ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ అకస్మాత్తు పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.