Gold Price Today: కొంచెం ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా సోమవారం బంగారం ప్రియులకు కొంత ఊరట లభించింది.
- Harishth Thanniru
- Published On : September 25, 2023 / 07:04 AM IST
Gold rates
Gold and Silver Prices: బులియన్ మార్కెట్ (Bullion Market) లో గత కొంతకాలం నుంచి బంగారం (Gold), వెండి (Silver) ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా సోమవారం బంగారం ప్రియులకు కొంత ఊరట లభించింది. పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950 వద్ద కొనసాగుతోంది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950 వద్ద కొనసాగుతుంది.
GOld
దేశంలోని ప్రధాన నగరాల్లో..
– దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,100.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,210 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,230 .
– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950.
– కోల్‌కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950.
– ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,950కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,950.
Gold
వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి రూ. 79,300 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 79,300, ముంబయి, ఢిల్లీ, కోల్ కతా వంటి ప్రాంతాల్లో రూ. 75,800, బెంగళూరులో కిలో వెండి రూ. 75,000 వద్ద కొనసాగుతుంది.
