Cm Revanth: కేసు ఏదైనా ఓవర్ టు సీబీఐ.. రేవంత్ వ్యూహం వెనకున్న మర్మమేంటి..?
ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న కాళేశ్వరం కేసును కూడా సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు..రెండు సార్లు కేంద్రానికి లేఖ కూడా రాసింది రేవంత్ సర్కార్.
- Naveen
- Published on- May 7, 2026 / 09:59 PM IST
- మొన్న కాళేశ్వరం..నిన్న విద్యుత్ కొనుగోళ్ల స్కాం..
- కేసులన్నీ ఓవర్ టు సీబీఐ అంటున్న రేవంత్ సర్కార్
- ఇప్పటికే కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం లేఖ..
- కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలంటూ సీబీఐ అస్త్రం
- బీఆర్ఎస్, బీజేపీని కార్నర్ చేసేలా రేవంత్ సిబిఐ స్కెచ్
Cm Revanth: ఓవైపు దూకుడు. ఇంకోవైపు పదునైన వ్యూహాలు. అటు పార్టీని.. ఇటు ప్రభుత్వంలో అంతా సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకోవైపు పదవుల పంపకం షురూ చేశారు. ఆల్మోస్ట్ ఈ మంత్ లోనే క్యాబినెట్ ప్రక్షాళన, నామినేటెడ్, పార్టీ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఫిక్స్ అయిపోయారట. మరోవైపు అంతకు మించి అన్నట్లుగా.. పొలిటికల్ స్కెచ్‌లు వేస్తున్నారు. కీలక కేసులన్నీ ఓవర్ టు సీబీఐ అంటూ..పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారట ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి పదేపదే సీబీఐ వైపు మొగ్గు చూపడం వెనుకున్న మతలబేంటి? ఈ వ్యూహం వెనుక ఉన్న మర్మమేంటి..?
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇంకో రెండేళ్ల తర్వాత జరగబోయే ఎలక్షన్స్ కోసం ఇప్పటినుంచే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి పార్టీలు. సీఎం రేవంత్ రెడ్డి అయితే..బీఆర్ఎస్, బీజేపీ కంటే ఓ అడుగు ముందుకేసి..నెక్స్ట్ లెవల్ ప్లానింగ్స్ చేస్తున్నారట. రాజకీయ ప్రత్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పేందుకు ఒక దెబ్బకు రెండు పిట్టలు అనేలా పొలిటికల్ వెపన్స్ బయటికి తీస్తున్నారట. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ లేఖ రాసి..చర్చకు తెరలేపారు.
బీజేపీని బీఆర్ఎస్ తో కలుపుతూ విమర్శలు..
తాము లేఖ రాసి నెలలు గడిచిపోతున్నా..ఇప్పటివరకు సీబీఐ నుంచి రెస్పాన్స్ లేదంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని బీఆర్ఎస్ తో కలుపుతూ విమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్ గా తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే..కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి అప్పగించిన రేవంత్ సర్కార్.. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలంటూ సీబీఐకి అప్పగించాలని డిసైడ్ అయ్యింది. దీనిపై త్వరలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసి విచారణ కోరేందుకు సర్కార్ సిద్ధమవుతుండటం..తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది రేవంత్ సర్కార్. గతంలోనే జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. అయితే విచారణ సమయంలో కమిషన్ ఛైర్మన్ నిబంధనలకు విరుద్దంగా..పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లడంతో..ఆయనను తప్పించి..జస్టిస్ లోకూర్ నేతృత్వంలో విచారణను పూర్తి చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు జస్టిస్ లోకూర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ కోరాలని సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకోవడం పొలిటికల్‌గా చర్చనీయాంశం అవుతోంది.
విద్యుత్ కుంభకోణంపై మళ్లీ సీబీఐనే ఎంచుకోవడం వెనుక వ్యూహం..!
ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న కాళేశ్వరం కేసును కూడా సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు..రెండు సార్లు కేంద్రానికి లేఖ కూడా రాసింది రేవంత్ సర్కార్. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరి 10 నెలలు గడుస్తోంది. అయినా… కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ, విద్యుత్ కుంభకోణంపై రేవంత్ మళ్లీ సీబీఐనే ఎంచుకోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీబీఐ భుజంపై తుపాకి పెట్టి..బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేయాలన్నదే రేవంత్ ప్లాన్‌గా కనిపిస్తోంది. కాళేశ్వరంతో పాటు..విద్యుత్ కొనుగోళ్ల కేసులో..కేంద్రం సీబీఐ విచారణకు అంగీకరిస్తే..గత ప్రభుత్వ పెద్దలు, బీఆర్ఎస్ చిక్కుల్లో పడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఒకవేళ సీబీఐ విచారణపై..కేంద్రం స్పందించకపోతే..బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం..సీక్రెట్ ఫ్రెండ్ షిప్ ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లడమే రేవంత్ అసలు ప్లాన్ అంటున్నారు. దీంతో..ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా..విచారణ జరిగితే బీఆర్ఎస్ ఇరికిపోతుంది..విచారణ జరగకపోతే ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టొచ్చన్నది రేవంత్ రెడ్డి ప్యూహంగా చెబుతున్నారు.
గత సర్కార్ హయాంలో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూ వస్తున్న రేవంత్ ప్రభుత్వం..సాక్షాధారాలతో ప్రూవ్ చేయాలనే ప్లాన్‌తో ముందుకెళ్తోందట. దీనిలో భాగంగానే..కాళేశ్వరం కమిషన్, జస్టిస్ లోకూర్ కమిషన్ రిపోర్టులను అస్త్రాలుగా మలుచుకుని కేసీఆర్ హయాంలో అక్రమాలు జరిగాయని ఎక్స్‌పోజ్ చేసే స్కెచ్ వేస్తున్నారట. మరింత వ్యూహాత్మకంగా..బాల్‌ను కేంద్రం కోర్టులోకి నెట్టి..బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారట. కాళేశ్వరం, కరెంట్ కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరుగుతుందో..లేక పొలిటికల్ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుందో చూడాలి.
Also Read: తెలంగాణకు మోదీ..! చేరికలు ఉంటాయా? బీజేపీకి టచ్‌లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌నేతలెవరు?
