KTR: ఇక సమరమే.. నెక్స్ట్ ఎలక్షన్సే టార్గెట్..! పార్టీ బలోపేతంపై కేటీఆర్ ఫోకస్..
అప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు. ఇక నుంచి నో మిస్టేక్స్..నో క్లాషెస్. ఓన్లీ వర్క్ మోడ్. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే టైముంది. అప్పటివరకు ఫీల్డ్‌లోనే ఉండాలి.
- Naveen
- Published on- May 6, 2026 / 10:39 PM IST
- టార్గెట్ నెక్స్ట్ ఎలక్షన్స్..ఫీల్డ్‌లోనే బీఆర్ఎస్
- పార్టీ బలోపేతంపై కేటీఆర్ ఫోకస్..జిల్లాల వారిగా సమీక్ష
- నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలపై కేటీఆర్ సీరియస్
- గ్రూప్ పాలిటిక్స్‌ను పక్కనపెట్టి పని చేయాలని క్లాస్
- ఓరుగల్లులో రైతు సంగ్రామ సదస్సు వేదికగా గర్జన
KTR: కారణాలు ఏవైనా 2023 ఎన్నికల్లో ఓడిపోయాం. రెండున్నరేళ్లు ప్రతిపక్ష పాత్ర కూడా పూర్తి అయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఫీల్డ్‌లోనే ఉందాం. వరుసగా సభలు పెడదాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదామంటూ..లీడర్లకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాల వారిగా సమీక్షలు చేస్తున్న కేటీఆర్..గ్రూపు తగాదాలు పక్కనపెట్టి పని చేయాలని నేతలకు క్లాస్ తీసుకుంటున్నారట. ఓరుగల్లు నుంచే శంఖారావం పూరించిన కేటీఆర్.. కాంగ్రెస్ డిక్లరేషన్లు బోగస్ అంటూ దుమ్మెత్తిపోశారు.
అప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు. ఇక నుంచి నో మిస్టేక్స్..నో క్లాషెస్. ఓన్లీ వర్క్ మోడ్. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే టైముంది. అప్పటివరకు ఫీల్డ్‌లోనే ఉండాలి. మీరే కాదు.. నేను కూడా పబ్లిక్‌లోనే ఉంటానంటూ నేతలకు దిశానిర్దేశం చేస్తూ..దూకుడు పెంచుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు ఉట్టి మాటలే అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరుసగా సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓరుగల్లు వేదికగా నిర్వహంచిన రైతు సంగ్రామ సదస్సులో..కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా బాణాలు ఎక్కుపెట్టారు కేటీఆర్. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశారని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేసి చర్చకు దారితీశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్లపై పోరుబాట ప్రకటించిన బీఆర్‌ఎస్..హైదరాబాద్, ఖమ్మం, కామారెడ్డిలో సభలు పెట్టేందుకు కౌంటర్ ప్లాన్ చేస్తోంది.
ఆ తప్పులు మళ్లీ చేయకుండా డైరెక్షన్స్..
ఓవైపు కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూనే..సొంత పార్టీ నేతలను సెట్‌రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా..నియోజకవర్గాల్లో గ్రూప్ వార్‌కు చెక్ పెట్టేలా డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్..తన దృష్టిని వచ్చిన అంశాలపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో పెరుగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కోటి హైకమాండ్ దృష్టికి వస్తుండగా, వాటికి ఇప్పుడే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఎన్నికల టైమ్‌లో ప్రజల్లో కేసీఆర్‌పై పెద్దగా వ్యతిరేకత లేకున్నా..స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి దెబ్బతీసిందని కేటీఆర్ అభిప్రాయపడుతున్నారట. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి..కానీ తమ ఎమ్మెల్యే మాత్రం వద్దు అనే భావన కొన్ని చోట్ల కనిపించిందని, అదే పార్టీకి నష్టం చేసిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న విభేదాలను ముందుగానే సెట్ చేసేందుకు పార్టీ చర్యలు స్పీడప్ చేసింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితిని కేటీఆర్ ఉదాహరణగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఇద్దరి అనుచరులు తమ నేతే కాబోయే ఎమ్మెల్యే అంటూ పోస్టర్లు, ప్రచారం చేయడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిస్థితే చాలా నియోజకవర్గాల్లో ఉందన్న సమాచారం బీఆర్ఎస్ హైకమాండ్‌కు చేరిందట. ఈ పరిస్థితి పార్టీకి మళ్లీ ప్రమాదంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నారట.
గ్రూప్ పాలిటిక్స్ మానుకోవాలని వార్నింగ్..
అందుకే జిల్లాల వారిగా సమీక్షలు చేస్తున్న కేటీఆర్..ముందుగా గ్రూప్ పాలిటిక్స్ మానుకోవాలని నేతలకు గట్టిగానే హెచ్చరిస్తున్నారట. టికెట్ల కోసం ఇప్పటి నుంచే పోట్లాడటం మానేసి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పోరాటంపై దృష్టి పెట్టాలని, పార్టీ కోసం నిబద్దతతో పనిచేసే వారికి అవకాశాలు కచ్చితంగా వస్తాయని కేటీఆర్ హితోపదేశం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడే టికెట్ ఫైట్ ఇలా కొనసాగుతుంటే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటో అన్న చర్చ మొదలైంది.
Also Read: రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. 25 మంది మైనర్ల వీడియోలు.. రూ.40 లక్షలు వసూలు
