Cm Advisor Post: ప్రభుత్వ సలహాదారు పదవిపై ఎందుకీ సస్పెన్స్? ఆ కీలక పదవి దక్కేదెవరికి, వేం నరేందర్ రెడ్డి స్థానంలోకి వచ్చేదెవరు?
ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన సలహాదారు పోస్టు చాలా కీలకమని చెప్పొచ్చు. సీఎంకు రాజకీయ సలహాదారుగా ఉండే ఈ పోస్టులో అత్యంత నమ్మకమైన వ్యక్తిని పెట్టుకుంటారు. సీఎంకు ఎక్కడా ఎలాంటి రిమార్క్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ పోస్టులో ఉండేవారికి ఉంటుంది.
- Naveen
- Published On : April 3, 2026 / 08:28 PM IST
- ప్రభుత్వ సలహాదారు పదవిపై లీడర్ల ఆశలు
- అడ్వైజర్ పోస్టు కోసం రేవంత్ సన్నిహితుల ప్రయత్నాలు
- సలహాదారు పోస్ట్ విషయంలో సీఎం ఆలోచన ఏంటి?
Cm Advisor Post: ముఖ్యమంత్రికి నీడలాగ ఉండే పోస్ట్. తెలంగాణలో ఆ కీలక పదవి ఎవరికి దక్కబోతోంది? సీఎం సన్నిహితుడు రాజీనామా చేసిన ఆ పోస్టు దక్కేదెవరికి? ఆ పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముంది? ఇప్పుడిదే అధికార కాంగ్రెస్‌తో పాటు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. రేవంత్ రెడ్డి స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. అత్యంత కీలకమైన ప్రభుత్వ సలహాదారు పదవి అంశంలో ముఖ్యమంత్రి మదిలో ఏముందనేది ఉత్కంఠ రేపుతోంది. వేం నరేందర్ రెడ్డి ప్లేస్‌లో మరొకరిని నియమిస్తారా? అసలు సలహాదారుల పదవిపై సీఎం ఆలోచన ఏంటి?
మొన్నటివరకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎలక్ట్ అయ్యారు. దీంతో వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన సలహాదారు పోస్ట్‌ను ఎవరితో భర్తీ చేస్తారన్న అంశం అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నా వేం నరేందర్‌రెడ్డికి ఉన్న ప్రాముఖ్యత వేరుగా ఉంటూ వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడే కాకుండా..ఆయనకు అత్యంత నమ్మకస్తుడు కూడా.
ఏ విషయాన్నైనా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగలిగిన చనువు, చొరవ ఒక్క వేం నరేందర్ రెడ్డికే ఉన్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వేం నరేందర్ రెడ్డిని తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. అయితే రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేయడానికి ముందే ప్రభుత్వ సలహాదారు పదవికి రిజైన్ చేశారాయన. దీంతో ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి స్థానంలో వచ్చే సలహాదారు ఎవరనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
అడ్వైజర్ల అంశంలో విమర్శలు రాకుండా చూసుకోవాలనే ఆలోచన..
రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం విషయంలో వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కానీ ఆయన రాజీనామా చేసిన ప్రభుత్వ సలహాదారు పదవిపై మాత్రం చాలా మందే ఆశలు పెట్టుకున్నారట. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే కొందరు నేతలు గవర్నమెంట్ అడ్వైజర్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. తమ మనసులోని మాటను కొందరు ఇప్పటికే రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సీఎం మాత్రం ఇప్పటివరకు ఎవరికీ హామీ ఇవ్వలేదని అంటున్నారు.
ఇక ఈ మధ్య ప్రభుత్వ సలహదారు నియామకం విషయంలో కాస్త కాంట్రవర్సీ చర్చ జరుగుతోంది. ఈ మధ్యే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సలహాదారులనే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వేం నరేందర్ రెడ్డి..పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరంటూ మండిపడ్డారు. వాళ్లిచ్చిన సలహాలేంటి అంటూ ప్రశ్నించారు. దీంతో అడ్వైజర్ల అంశంలో విమర్శలు రాకుండా చూసుకోవాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన సలహాదారు పోస్టు చాలా కీలకమని చెప్పొచ్చు. సీఎంకు రాజకీయ సలహాదారుగా ఉండే ఈ పోస్టులో అత్యంత నమ్మకమైన వ్యక్తిని పెట్టుకుంటారు. సీఎంకు ఎక్కడా ఎలాంటి రిమార్క్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ పోస్టులో ఉండేవారికి ఉంటుంది. అందుకే కీలకమైన పోస్టు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట సీఎం రేవంత్‌రెడ్డి. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కేవీపీ రామచందర్‌రావు కూడా సేమ్ టు సేమ్ వేం నరేందర్ రెడ్డి రోల్‌ను పోషించారు. అప్పట్లో కేవీపీ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత..రాష్ట్ర ప్రభుత్వంలో కీరోల్‌లో కంటిన్యూ అయ్యారు.
ఇన్ డైరెక్ట్‌గా వేం నరేందర్ రెడ్డినే కొనసాగిస్తారనే చర్చ..
వైఎస్..కేవీపీని నమ్మినంతగా మరే నేతను నమ్మలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ సిచువేషన్‌ను కంటిన్యూ చేసేలా ఉందనే చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. పొలిటికల్ అడ్వైజరీ పోస్ట్‌ను కూడా ఎవరికి ఇవ్వకుండా..ఇన్ డైరెక్ట్‌గా వేం నరేందర్ రెడ్డినే కొనసాగిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. సలహాదారు పోస్ట్ విషయంలో నేతల ఆశలు మాటేమిటి? సీఎం రేవంత్ ఆలోచన ఏంటో ఇప్పట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు.
Also Read: కొత్తగా 2 లక్షల మందికి ఫించన్లు.. ఈ పత్రాలన్నీ ఉన్నాయా.. ఎక్కడ దరఖాస్తు చేయాలంటే
