PM Modi Telangana Tour: తెలంగాణకు మోదీ..! చేరికలు ఉంటాయా? బీజేపీకి టచ్‌లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌నేతలెవరు?
బీజేపీలో చేరికపై మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి క్లారిటీ ఇచ్చినా..వారి కుటుంబం వేస్తున్న అడుగులు బీజేపీలో చేరేలా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్‌లోనూ చర్చకు దారి తీసిందంటున్నారు.
- Naveen
- Published on- May 7, 2026 / 08:40 PM IST
PM Modi Telangana Tour: బెంగాల్‌పై ఫోకస్ చేసి మరీ కొట్టారు. నెక్స్ట్ మిషన్ సౌత్ లో భాగంగా..తెలంగాణపై బీజేపీ కాన్సంట్రేట్ చేసింది. నైజాంలోనూ కాషాయ జెండా ఎగరవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వత…నరేంద్ర మోదీ తొలి సభ తెలంగాణలోనే జరుగనుంది. ఈ సభా వేదికగా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపనుందా? ఇంతకు కమలనాథులతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలెవరు? మోదీ సభలో చేరికలు ఉండబోతున్నాయనే టాక్ నిజమేనా.. మైండ్ గేమా?
గ్రేటర్ లో పాగా వేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్..
ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్..ప్రధాని మోదీ ఈ నెల 10న తెలంగాణకు వస్తున్నారు. ఇప్పటికే ప్రధాని షెడ్యూల్ టూర్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్‌లో టైమ్ స్పెండ్ చేయనున్నారు ప్రధాని. ఇందులో భాగంగా అధికార, పార్టీ కార్యక్రమాలు కూడా ఫిక్స్ చేశారు. పార్టీ కార్యక్రమాల వేదికగా బీజేపీని బలోపేతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సాధారణ ఎన్నికల ముందు జరిగే గ్రేటర్ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి అన్ని పార్టీలు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట.
బీజేపీలోకి మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ?
ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు రావడం పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంతో కలిసి ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిశారు. దీంతో బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంతో సహా కమలం గూటికి చేరేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీలో చేరికపై మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి క్లారిటీ ఇచ్చినా..వారి కుటుంబం వేస్తున్న అడుగులు బీజేపీలో చేరేలా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్‌లోనూ చర్చకు దారి తీసిందంటున్నారు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతీరెడ్డి బీజేపీలో చేరబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై నర్మగర్భంగా స్పందిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
గ్రేటర్‌లో కీలకంగా ఉన్న కాంగ్రెస్ నేతలే లక్ష్యం..!
ఇక గ్రేటర్‌లో కీలకంగా ఉన్న కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపేందుకు సిద్ధమయ్యారట కమలనాథులు. గ్రేటర్ పరిధిలో ఉన్న ఒక్కరిద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలను చేర్చకునేలా పావులు కదుపుతున్నారట. జీహెచ్ఎంసీ, మల్కాజ్ గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో పాగా వేసేలా బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. నరేంద్ర మోదీ సభ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి తీసుకోవడం ద్వారా ఆ రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలనే ప్లాన్ నడుస్తోందట.
మోదీ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్టేట్ బీజేపీ లీడర్లు..ఇక మోదీ సభకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా పార్టీ దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఉన్న బలమైన నేతలను, ఆయా పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను ఐడెంటిఫై చేసి వారిని దశల వారీగా కమలం గూటికి చేర్చుకోవాలనేది ప్లాన్ అంటున్నారు. మరి మోదీ సభ వేదికగా బీజేపీలో చేరేదెవరో చూడాలి.
Also Read: తమిళ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు.. తమిళనాట కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ..
