Jeevan Reddy: గులాబీ గూటికి జీవన్ రెడ్డి..! బీఆర్ఎస్ లెక్కలేంటి? కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి?

కాంగ్రెస్‌తో బంధం తెంచుకున్న జీవన్ రెడ్డి..గులాబీ పార్టీతో ఆత్మీయ అనుబంధం ఏర్పరుచుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా ఆయన సీనియారిటీని గౌరవిస్తుంది. కేటీఆర్ జీవన్‌రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

  • Updated on- April 11, 2026 / 10:26 PM IST
  • జీవన్ సెంట్రిక్‌గా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య డైలాగ్‌ వార్
  • జీవన్‌రెడ్డి బలం తెలిసేలా జగిత్యాలలో భారీ సభకు బీఆర్ఎస్ ప్లాన్
  • జగిత్యాల జైత్రయాత్ర అంటూ పబ్లిక్ అటెన్షన్‌ను గ్రాబ్‌ చేసే స్కెచ్
  • జగిత్యాల సభ తర్వాత ఫుల్ యాక్టీవ్ మోడ్‌లోకి గులాబీ బాస్.!
  • జీవన్‌రెడ్డి విషయంలో అటాకింగ్‌ మోడ్‌లోకి కాంగ్రెస్

Jeevan Reddy: హస్తంకు హ్యాండ్. గులాబీ గూటికి ఎంట్రీ. మీ రాక మాకెంతో సంతోషం సుమండీ అంటూ కారు పార్టీ స్వాగతం పలుకుతుంటే..ఆయన ఎగ్జిట్‌తో జరిగే డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకునే పనిలో కాంగ్రెస్ బిజీ అయిపోయింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను, జీవన్‌రెడ్డి కలిసిన తర్వాత పొలిటికల్ సినారియో ఒక్కసారిగా మారిపోయింది. పెద్దాయన చేరిక తమకు పెద్ద బలమని ఎక్స్‌పోజ్ చేసుకుంటోంది గులాబీ పార్టీ. ఇక జీవన్ రెడ్డి కారెక్కడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో..ప్లాన్-బిని ఇంప్లిమెంట్ చేస్తోంది హస్తం పార్టీ. జీవన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ లెక్కలేంటి? కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? నిన్నటిదాకా చూసీచూడనట్లు వ్యవహరించిన హస్తం లీడర్లు టోన్ మారడం వెనుక వ్యూహం ఏంటి?

ప్లస్ పాయింట్‌గా చెప్పుకునే పనిలో బీఆర్ఎస్. ఆయన వెళ్తే జరిగే నష్టమమేమీ లేదని చెప్పకపోయినా..డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకునేందుకు కాంగ్రెస్ ఆరాటం. దీంతో ఇప్పుడు తెలంగాణలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సెంట్రిక్‌గానే పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. పార్టీలో సీనియర్ నేత కావడం..దాదాపు నాలుగు దశాబ్ధాల అనుబంధం ఉండటంతో మొన్నటివరకు ఆయన వినిపించిన అసంతృప్తి రాగంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. కొందరు సీనియర్లు జగ్గారెడ్డి వంటి వారు.. జీవన్‌రెడ్డి పార్టీని వీడటంపై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం జోక్యం చేసుకోవాలంటూ కోరారు. అయితే జీవన్ రెడ్డి కారెక్కేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకోవడం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి..ఈ నెల 20న బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో హస్తం పార్టీ ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేస్తోంది.

జీవన్ రెడ్డిపై రాజకీయ దాడి మొదలు పెట్టిన అత్యంత సన్నిహితులు..

అయితే జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్‌లో రెండు రకాల వాదనలు నడుస్తున్నాయట. జీవన్‌రెడ్డితో అనుబంధం ఉన్న నేతలు ఇప్పటికైనా సరే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని..ఆయన్ను పార్టీలో కొనసాగేలా చూడాలని కోరుతున్నారట. ఇంకొందరు ఇంటర్నల్‌గా ఆవేదన వ్యక్తం చేస్తుండగా..మరికొందరు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయినా..రాజకీయంగా దాడి చేయక తప్పదని అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు..శిష్యుడిగా ముద్రపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం వంటి నేతలు విమర్శల దాడి షురూ చేశారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తుండటంతో జీవన్‌రెడ్డిపై అటాక్ చేయక తప్పదని భావిస్తున్నారట. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్‌రెడ్డిపై గౌరవం ఉందంటూనే..ఆయన కారెక్కుతుండటంతో బాణాలు ఎక్కుపెడుతున్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కారు పార్టీ స్కెచ్..

ఇక జీవన్‌రెడ్డి రాక తమకు ఎంతో ప్లస్ పాయింట్ అని ఎక్స్‌పోజ్ చేసుకునే ఎత్తుగడ వేస్తోంది బీఆర్ఎస్. జీవన్ చేరికతో ఉత్తర తెలంగాణలో..ప్రత్యేకంగా కరీంనగర్, నిజామాబాద్‌లో తమకు కలిసి వస్తుందని కారు పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్స్ నడుస్తున్నాయట. అందుకే ఈ టెంపోను ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నారట. జీవన్‌రెడ్డి చేరిక సభను పెద్దఎత్తున నిర్వహించి..ఆయన సత్తాను కాంగ్రెస్‌కు తెలియజేసి..అది తమకు కలిసి వచ్చే అంశంగా మల్చుకునే ప్లాన్‌లో ఉందట గులాబీ దళం. గతంలో పీపుల్స్ వార్ పార్టీ.. జగిత్యాల యాత్ర పేరుతో భారీ కార్యక్రమం చేపట్టి..ప్రజల తరఫున అప్పటి పాలకులపై తిరుగుబావుటా ఎగరవేసి సక్సెస్ కావడంతో..అదే సెంటిమెంట్‌తో జగిత్యాల సభను అస్త్రంగా మల్చుకుని మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ వేస్తోందట కారు పార్టీ.

ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడి ఆల్రెడీ రెండున్నరేళ్లు అవుతుండటంతో..జగిత్యాల నుంచే సమరభేరి మోగించేందుకు రెడీ అవుతున్నారట గులాబీ బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత..కారణలేమైనా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్..ఇక నుంచి జనంలోనే ఉండాలనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. ఈ నెల 20న జీవన్ రెడ్డి పార్టీ జాయినింగ్‌తో పాటు పార్టీ ప్లీనరీ సమావేశాలతో దూకుడు పెంచాలని భావిస్తున్నారట. ఇక కాంగ్రెస్ కూడా జీవన్ రెడ్డి విషయంలో ఇప్పటివరకు ఉన్న సాప్ట్ కార్నర్‌ను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్‌తో బంధం తెంచుకున్న జీవన్ రెడ్డి..గులాబీ పార్టీతో ఆత్మీయ అనుబంధం ఏర్పరుచుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా ఆయన సీనియారిటీని గౌరవిస్తుంది. కేటీఆర్ జీవన్‌రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత కేసీఆర్‌ను కలిసేందుకు ఫాంహౌస్‌కు వచ్చిన జీవన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు గులాబీ బాస్‌. కేసీఆర్ కూడా జీవన్‌రెడ్డిని ఆలింగనం చేసుకుని ఆత్మీయ స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్లాన్-బిలో భాగంగా జీవన్‌రెడ్డిపై అటాక్ మోడ్ స్టార్ చేసింది. జీవన్‌రెడ్డి సెంట్రిక్‌గా ఇంకా ఎన్నాళ్లు ఈ పొలిటికల్ ఫైట్ నడుస్తుందో చూడాలి.

Also Read: అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. 6 అంతస్తుల భవనం కూల్చివేత