Heatwave Alert : బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు మాడు పగిలే ఎండలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
Heatwave Alert : భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుకుంటూ వస్తోంది. ప్రస్తుతం భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.
- Harishth Thanniru
- Published on- April 15, 2026 / 07:45 AM IST
Heatwave Alert
- ఉగ్రరూపందాల్చుతున్న భానుడు
- రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
- మూడు రోజులు ఎండల తీవ్రత ఎక్కువే
- వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
Heatwave Alert : భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుకుంటూ వస్తోంది. ప్రస్తుతం భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంగళవారం నాటి వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read : Pm Modi: ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏయే అంశాలపై చర్చించారంటే
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురు వారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని, తరువాత రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండల ప్రభావం ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో మాడుపగిలే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అడవి దేవులపల్లి మండలంలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 43.4 డిగ్రీల సెల్సియస్, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో 43.3, అదిలాబాద్ లో 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని, ముఖ్యంగా మూడు రోజులపాటు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
మరోవైపు.. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బయటకు రావొద్దని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినట్లయితే ఎండల తీవ్రతను తట్టుకునే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
