×
Ad

Telangana High Court: గుడ్ న్యూస్.. 8 వారాల్లో వారందరికీ ఇళ్ల స్థలాలు, పెన్షన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు

పెన్షన్లు, ఇళ్ల స్థలాలు కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

  • Published On : February 23, 2026 / 06:27 PM IST

Telangana High Court Representative Image (Image Credit To Original Source)

  • ఉద్యమకారులకు గుడ్ న్యూస్
  • 8 వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలన్న హైకోర్టు
  • ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫ్రీడమ్ ఫైటర్ విభాగానికి ఆదేశాలు

Telangana High Court: తెలంగాణ సాధనలో పోరాటం చేసిన ఉద్యమకారులకు గుడ్ న్యూస్. ఉద్యమకారుల హామీలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 8 వారాల్లో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పింది. అలాగే పెన్షన్లు మంజూరు చేయాలంది. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

హామీ ప్రకారం తమకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. అభయహస్తం స్కీమ్ కింద దరఖాస్తు చేసిన అర్హులైన ఉద్యమకారులకు 8 వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫ్రీడమ్ ఫైటర్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి. కోర్టు తీర్పు పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నాన్న, కొడుకు, ఓ తలకొరివి.. టచ్ చేసే స్టోరీ.. రేపో మాపో ఇలాంటివి మామూలు అయిపోతాయేమో..