Swapnalok Complex: సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రఖ్యాత స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డింగ్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థులు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి వారి నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం
నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్డింగ్ లోపల పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్స్ లోపల పలు వాణిజ్య సముదాయాలు ఉండటంతో, పదుల సంఖ్యలో సిబ్బంది లోపలే చిక్కుకున్నారు. ఉద్యోగులు ఫ్లోర్లలోని రూమ్లలో ఉండిపోయారు. సహాయం కోసం అర్థిస్తున్నారు. తమ వారికి ఫోన్లు చేసి సహాయం చేయమని కోరుతున్నారు. సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి, తాము లోపలే ఉన్నామని, తమను రక్షించమని వేడుకుంటున్నారు. అగ్ని ప్రమాదం వల్ల వెలువడుతున్న పొగతో బాధితులు లోపల ఉక్కిరికిబిక్కిరి అవుతున్నారు. కాంప్లెక్స్ పరిసరాల్లో కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.