×
Ad

Billionaires List : తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు వీరే.. దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ.. ఈసారి 308 మంది..

Billionaires List : హురున్ ప్రకారం.. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతదేశం మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది. దేశంలో సంపద సృష్టి కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. సంఖ్య పరంగానే కాకుండా, అన్ని రంగాల్లోనూ భారతీయ పారిశ్రామిక వేత్తలు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారు.

Hurun Global Rich List 2026 Billionaires letest List

  • హురున్‌ ఇండియా గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ -2026 విడుదల
  • భారతదేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ
  • తెలుగు రాష్ట్రాల్లో టాప్ ప్లేస్‌లో మురళీ దివీ

Billionaires List : ఈ సంవత్సరం భారతదేశంలోని మొత్తం బిలియనీర్ల సంఖ్య 308కి చేరుకుంది. 2025 జాబితాతో పోలిస్తే 24మంది బిలియనీర్లు పెరిగారు. వీరిమొత్తం సంపద వార్షిక ప్రాతిపదికన 10శాతం పెరిగి రూ.1126 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాదికిగాను హురున్ ఇండియా గ్లోబల్ రిచ్ లిష్ట్-2026ను వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వ్యాపారవేత్తలు కూడా స్థానం సంపాదించారు.

Also Read : Gold discounts in Dubai : రండి బాబు రండి.. బంగారం తక్కువకే అమ్మేస్తున్న దుబాయ్.. కారణాలివే.. బంపర్ ఆఫర్

హురున్ ప్రకారం.. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతదేశం మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది. దేశంలో సంపద సృష్టి కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. సంఖ్య పరంగానే కాకుండా, అన్ని రంగాల్లోనూ భారతీయ పారిశ్రామిక వేత్తలు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారు. హురున్ విడుదల చేసిన భారత కుబేరుల జాబితాను పరిశీలిస్తే.. అగ్ర స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నిలిచారు. అంబానీ కుటుంబ సంపద గడిచిన ఏడాది కాలంలో 9శాతం పెరిగి రూ.9.8లక్షల కోట్లకు పెరిగిందని హురున్ రిపోర్టు వెల్లడించింది. ముకేశ్ అంబానీ భారతదేశంతోపాటు.. ఆసియా మొత్తంలో సంపన్నుడిగా నిలిచాడు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కుబేరులో జాబితాలో ముకేశ్ అంబానీ 17వ స్థానంలో కొనసాగుతున్నాు.

భారతదేశం కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఫ్యామిలీ రెండో స్థానంలో నిలిచింది. ఆయన ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ.7.5లక్షల కోట్లు. అదువిధంగా.. రూ.3.2లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో హెచ్‌సీఎల్ టెక్ చైర్మన్ రోష్నీ నాడార్ మూడో స్థానంలో నిలిచారు. మన టాప్-10 బిలియనీర్లలోని ఏకైక మహిళ కూడా. అయితే, గడిచిన ఏడాది కాలంలో అదానీ ఆస్తి 14శాతం, నాడార్ సంపద 10శాతం తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో సంపన్నుల జాబితాలో దివీస్ ల్యాబ్స్ మురళీ దివి అగ్ర స్థానంలో ఉన్నారు. ఈసారి పదికిపైగా తెలుగు వారికి భారత కుబేరుల జాబితాలో చోటు దక్కింది. అందులో దివీస్ లేబోరేటరీస్ చైర్మన్ మురళీ దివి అగ్రస్థానంలో ఉన్నారు. తరువాతి స్థానాల్లో.. పీ పిచ్చిరెడ్డి (ఎంఈఐఎల్), పీవీ కృష్ణారెడ్డి (ఎంఈఐఎల్), పార్థసారధి రెడ్డి (హెటెరో), అయోధ్య రామిరెడ్డి (రాంకీ గ్రూప్), వెంకటేశ్వరరెడ్డి (అపర్ణ ఎంటర్ ఫ్రైజెస్), కే. సతీశ్ రెడ్డి (డాక్టర్ రెడ్డీస్), జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్), బొల్లినేని భాస్కరరావు (కిమ్స్ హాస్పిటల్స్), ప్రతాప్ సీ రెడ్డి (అపోలో హాస్పిటల్స్), రామ్ ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా), జీ రవీందర్ రావు (యశోద హాస్పిటల్స్), ఎం. సత్యనారాయణ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా).