Hyderabad Lawyer: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన దుండగులు.. చికిత్స పొందుతూ మృతి.. సీసీ కెమెరాల్లో రికార్డు
Hyderabad Advocate: అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలం ఖాన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
- Harish Thanniru
- Updated on- May 23, 2026 / 04:51 PM IST
Hyderabad Advocate Khaja Moinuddin Dies In Suspected Hit And Run Case At Masab Tank
Hyderabad Lawyer: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయవాదిని దుండుగుల కారుతో ఢీకొట్టి హతమార్చారు. ఈ ఘటన మాసబ్ ట్యాంక్ పరిధిలోని శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read : Ivanka Trump : ఇవాంకా ట్రంప్‌ని లేపేయడానికి ప్లాన్.. పట్టుబడిన ఇరాన్ టెర్రరిస్ట్? అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
న్యాయవాది ఖాజా మెయినుద్దీన్ మాసబ్ ట్యాంక్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం మొయినుద్దీన్ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. రోడ్డు పక్కన పార్కుచేసిన కారులో ఎక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కారు వద్దకు వచ్చి కారు డోర్ తీస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో కారు ఆయన్ను బలంగా ఢీకొట్టింది. దీంతో మొయినుద్దీన్ కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. న్యాయవాది మృతితో హిట్ అండ్ రన్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే, అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన అలం ఖాన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు కొన్ని దశాబ్దాలుగా మా తండ్రి పోరాటం చేస్తున్నాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులను అలం ఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజ్ లు నిర్మించారు. వాటి గురించి ఎప్పటి నుంచో కేసులు వేస్తూ మా తండ్రి ఖాజా మొయినుద్దీన్ పోరాటం చేస్తున్నారని అన్నాడు.
మా నాన్నపై దాడి జరగడం ఇది ఆరోసారి. గతంలో మా ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారు. గత ఆరు నెలల క్రితం అలం ఖాన్ మా ఆఫీస్‌కు వచ్చి నన్ను బెదిరించాడు. ఇప్పుడు నాకు గాని, మా కుటుంబానికి కానీ ఏం జరిగినా అలం ఖాన్ దే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.. నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని మృతుడి కుమారుడు ఫర్హాన్ పేర్కొన్నాడు.
