MLC Election Counting : నాలుగోరోజు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్.. ఎల్.రమణ సహా 89 అభ్యర్థుల ఎలిమినేషన్

హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యాతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 89 మందిని ఎలిమినేట్ చేయడం పూర్తయ్యింది.

Hyderabad-Mahabubnagar-Rangareddy MLC Election Counting : హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యాతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 89 మందిని ఎలిమినేట్ చేయడం పూర్తయ్యింది. వీరిలో టీడీపీ అభ్యర్ధి ఎల్.రమణతో పాటు… స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ కూడా ఉన్నారు.

మొదటి , రెండో ప్రాధాన్యతా ఓట్లతో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి లక్షా 19 వేల 619 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు లక్షా 10వేల 500 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ 59 వేల 648 ఓట్లు… కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి 36వేల 726 ఓట్లు సాధించారు…

ట్రెండింగ్ వార్తలు