ITMS: హైదరాబాద్ ట్రాఫిక్‌లో సరికొత్త విప్లవం.. AI కెమెరాలతో నిఘా.. వాహదారులకు బిగ్ అలర్ట్
హైదరాబాద్ రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపేవారికి చెక్ పెట్టేందుకు (ITMS)ప్రభుత్వం సిద్ధమైంది.
- V Santhosh Kumar
- Published on- July 11, 2026 / 09:43 AM IST
Hyderabad Police to use AI technology for traffic control.
- హైదరాబాద్ రహదారులపై ఏఐ నిఘా
- రూల్స్ బ్రేక్ చేస్తే చలానా
- రద్దీని బట్టి సిగ్నల్స్ మార్పు
ITMS: హైదరాబాద్ రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపేవారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యాధునిక ‘ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (ITMS) అమలుకు రంగం సిద్ధం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైటెక్ కెమెరాలు, సెన్సార్ల సహాయంతో ట్రాఫిక్‌ను 24 గంటల పాటు పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం ఈ సరికొత్త టెక్నాలజీని తొలుత హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ఈ నిఘా వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Ranga reddy Tragedy: తెలంగాణను వణికించిన దారుణం.. ఫోక్సో కేసు కక్షతో.. ఆరుగురిని నరికేశాడు!
రద్దీని బట్టి సిగ్నల్స్.. ఆటోమేటిక్ ఈ-చలానాలు:
ఈ ఏఐ వ్యవస్థ రోడ్లపై ఉండే వాహనాల రద్దీని బట్టి స్వయంగా సిగ్నల్ టైమింగ్‌ను మార్చగలదు. వాహనాలు ఎక్కువగా ఉన్న వైపు గ్రీన్ సిగ్నల్ సమయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సిగ్నల్ జంప్ చేసినా, అతివేగంతో వెళ్లినా కెమెరాలు క్షణాల్లో వాహనం నంబర్‌ను గుర్తించి ఈ-చలానా జారీ చేస్తాయి. అంతేకాకుండా హెల్మెట్ లేకపోయినా, సీటుబెల్ట్ ధరించకపోయినా ఈ కెమెరాల నిఘా నుండి తప్పించుకోలేరు. అత్యవసర సేవలైన అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వస్తే ఆటోమేటిక్‌గా గ్రీన్ సిగ్నల్ పడేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
మెట్రో నగరాల తరహాలో పూర్తిస్థాయి అమలు:
హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు 80 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు మరో 3 వేల కొత్త వాహనాలు తోడవుతున్నాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు నగర పోలీస్ కమిషనర్ చైర్మన్‌గా ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే విజయవంతమైన ఈ ఐటీఎంఎస్ విధానాన్ని హైదరాబాద్‌లో పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే కెమెరా కంటికి చిక్కడం, చలానా పడడం ఖాయం.
