Hydraa Commissioner: హైడ్రాకు హైకోర్టు నోటీసులు..! ఫేక్ ప్రచారం అంటూ హైడ్రా కమిషనర్ ఆగ్రహం

హైకోర్టు ఫేక్ నోటీస్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

  • Published On : April 14, 2026 / 06:45 AM IST

Hydraa: హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ఫేక్ ప్రచారం అని తేల్చి చెప్పారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లకు హైకోర్టు సమన్లు అంటూ ఫేక్ నోటీస్ రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో సోషల్ మీడియాలో నోటీస్ వైరల్ కావడాన్ని రంగనాథ్ గుర్తించారు. తాజా కూల్చివేతల అంశంపై వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లకు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు హాజరు కావాలంటూ వచ్చిన నోటీస్ ఫేక్ అని చెప్పారు. సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్ సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు ఫేక్ నోటీస్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.