IAS Officers Transfers
Telangana IAS Officers Transfers : తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం.. పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు చోటు చేసుకున్నాయి.
Alao Read : Hyderabad : ఇక నుంచి జీహెచ్‌ఎంసీ మూడు కార్పొరేషన్లు.. ఉత్తర్వులు జారీ.. కమిషనర్లు నియామకం..
సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నడా. జ్యోతి బుద్ధప్రకాశ్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గా కూడా ఆయన కొనసాగనున్నారు.
ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించగా.. ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవిని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనికి అదనపు బాధ్యతలు కేటాయించింది. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ సీఎస్ గా రఘురాంశర్మల బాధ్యతలను అప్పగించింది. అంతేకాక.. మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో రఘురాం శర్మ కొనసాగనున్నారు.
వీరితోపాటు.. ఆర్.వి.కర్ణను జీహెచ్ఎంసీ కమిషనర్ గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా జి. శ్రీజనను నియమించగా.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా టి.వినయ్ కృష్ణా రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.