×
Ad

Hyderabad : ఇక నుంచి జీహెచ్‌ఎంసీ మూడు కార్పొరేషన్లు.. ఉత్తర్వులు జారీ.. కమిషనర్లు నియామకం..

Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహఎచ్ఎంసీ)ని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

GHMC

Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహఎచ్ఎంసీ)ని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ను ముడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం జీవో 55ను విడుదల చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది.

Also Read : Municipal Elections మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూకట్టిన ఓటర్లు..

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన నియామకం కాగా.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతున్నారు.

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లతో కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, అలాగే, సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనుంది.

పాత గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లు ఉన్నాయి. అయితే, డీలిమిటేషన్‌తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. వీటిన్నింటిని కలిపి మొత్తం 300 డివిజన్లకు జీహెచ్‌ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది.అ యితే, తాజాగా పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది.