Bank Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ బ్యాంకులో 250 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు.. జీతం ఎంతంటే? పూర్తి వివరాలు ఇవే
Bank Jobs : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) సిద్ధమైంది.
- Harish Thanniru
- Updated on- August 13, 2026 / 08:17 AM IST
icici bank jobs 250 relationship manager posts job mela in sangareddy district
Bank Jobs : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) సిద్ధమైంది. ఇందుకోసం ఈనెల 14వ తేదీన ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రైవేటు రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంక్ లో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపడుతుంది.
Also Read : Idli Sambar : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మెనూ.. ఇక నుంచి ఇండ్లీ, సాంబార్
నోటీసులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన నిర్వహించే ఉద్యోగ మేళా ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్‌లో మొత్తం 250 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతీయేటా రూ.3.12లక్షల సీటీసీ వేతనం లభించనుంది.
ఈ ఉద్యోగాలను పొందాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నోటీసు ప్రకారం.. 2024 నుంచి 2026 మధ్య డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు.
ఉద్యోగ మేళా సంగారెడ్డి జిల్లాలోని పాత ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఆగస్టు 14వ తేదీన (శుక్రవారం) ఉదయం 10గంటలకు ప్రారంభం కానుంది. అర్హత కలిగిన యువత తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను, అవసరమైన ఇతర పత్రాలతో ఉద్యోగ మేళాకు హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు.
ఈ నియామకానికి తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. దీంతో సంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన అర్హత ఉన్న యువత కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇదిలాఉంటే.. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి ముందుగానే వేదికకు చేరుకోవాలి. తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ పత్రాలు, గుర్తింపు పత్రాలు తదితర అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూ/ఇతర నియామక ప్రక్రియలో అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు.
ముఖ్యమైన వివరాలు:
♦ సంస్థ: ICICI Bank
♦ పోస్టు: Relationship Manager
♦ ఖాళీలు: 250
♦ విద్యార్హత: ఏదైనా డిగ్రీ
♦ డిగ్రీ బ్యాచ్: 2024–2026
♦ వయస్సు: 21–25 సంవత్సరాలు
♦ వేతనం: సంవత్సరానికి రూ.3.12 లక్షల CTC
♦ ఉద్యోగ ప్రాంతం: తెలంగాణ వ్యాప్తంగా
♦ ఉద్యోగ మేళా తేదీ: 14-08-2026
♦ సమయం: ఉదయం 10 గంటలు
♦ వేదిక: సంగారెడ్డి పాత ఐటీఐ కళాశాల ప్రాంగణం
