YSRTP : షర్మిల పార్టీకి.. రాజీనామా చేసిన ఇందిరాశోభన్!
వైఎస్ఆర్టీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ ఏర్పడిన నాటి నుంచి షర్మిల వెంట నడిచిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
- kunduru Vinod
- Published On : August 20, 2021 / 09:58 AM IST
Ysrtp
YSRTP : వైఎస్ఆర్టీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ ఏర్పడిన నాటి నుంచి షర్మిల వెంట నడిచిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజల అభిష్టం మేరకే తానూ రాజీనామా చేసినట్లు ఇందిరా శోభన్ ప్రకటించారు.
షర్మిల వైఎస్‌ఆర్ టీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుణ పడి ఉంటాను. అభి మానులు, తెలంగాణ ప్రజల కోరిక మేర కే ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను.” అని ఇందిరా శోభ పేర్కొన్నారు. కాగా ఇందిరా గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు.
షర్మిల పార్టీ ప్రకటించడంతో ఆమె పార్టీలో చేరారు. షర్మిల వెంట సభలు సమావేశాలకు హాజరవుతూ.. దగ్గరుండి చూసుకునే వారు.
