×
Ad

Jeevan Reddy: జగిత్యాల కాంగ్రెస్‌లో మున్సిపల్ ఎన్నికల టికెట్ల లొల్లి.. కార్యకర్తల కడుపు కొట్టారని జీవన్ రెడ్డి ఫైర్

ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు.

  • Published On : February 3, 2026 / 05:03 PM IST

 

Jeevan Reddy: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 50 వార్డుల్లో 30 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి, 20 వార్డులు జీవన్ రెడ్డికి కేటాయించంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య పంచాయితీ భగ్గుమంది. పార్టీ నిర్ణయంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బీఫారమ్ లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీఫారమ్ లు ఇచ్చారని ఆరోపించారు.

మరోవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.