MLA Padi Kaushik Reddy : MLA పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలతో దాడి.. దళిత ఎమ్మెల్యేను కించపరిచారంటూ
MLA Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. ఆయన దిష్టి బొమ్మ దహనం చేశారు.
- Dharani Pilli
- Published On : March 30, 2026 / 03:56 PM IST
kadiyam sri hari issue eggs and tomatoes thrown into mla padi kaushik reddy house in karim nagar
MLA Padi Kaushik Reddy : కరీంనగర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అసెంబ్లీ వేదికగా సీనియర్ నేత కడియం శ్రీహరి విషయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పొలిటికల్ హీట్ పెంచింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కడియం సానుభూతిపరులు.. సోమవారం కరీంనగర్‌లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అలాగే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మపై కోడిగుడ్లు, టమాటాలు విసిరి నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కడియంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శాసనసభలో ఆదివారం కడియం శ్రీహరి మాట్లాడుతుండగా.. కౌశిక్ రెడ్డి బెదిరించారని, గన్‌తో కాల్చి పడేస్తానని చేత్తో సైగలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వీడియో పరిశీలించి.. అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్‌ను కోరారు. దళిత నాయకుడు కడియం పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
