తగ్గేదే లే.. కొండా సురేఖపై కడియం శ్రీహరి ఫైర్
మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiyam Srihari) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- V Santhosh Kumar
- Updated on- July 8, 2026 / 04:32 PM IST
Kadiyam Srihari makes sensational comments about Konda Surekha.
- కొండా సురేఖపై కడియం ఫైర్
- నేనెవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదు
- అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టండి
Kadiyam Srihari: జనగామ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గ పరిధిలోని దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడటంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేయడంపై కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు.
NEET-UG: లీకుల ఎఫెక్ట్.. NEET-UGలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది అలానే నిర్వహిస్తారట
తానే స్వయంగా అధికారుల వద్దకు వెళ్తే అది సమీక్ష ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనిని సమీక్ష అనడం పూర్తిగా అవగాహన లోపమేనని కొట్టిపారేశారు. ఈ విషయంలో తానెవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, తనను ఎవరూ వివరణ అడిగే పరిస్థితి కూడా రాదని స్పష్టం చేశారు. తనకు తెలియకుండా అధికారుల దగ్గరకు వెళ్లకూడదనడం తాను కొత్తగా వింటున్నానని ఎద్దేవా చేశారు.
అభివృద్ధిని పట్టించుకోని వారు, ప్రజల మధ్య ఉండని వారే ఇలాంటి వివాదాలను సృష్టిస్తూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారని కడియం(Kadiyam Srihari) ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పరిధులు ఉండవని, ఎవరితోనైనా మాట్లాడవచ్చని గుర్తుచేశారు. తాను ప్రోటోకాల్‌కు లోబడే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడానని.. నియోజకవర్గ ఆలయాల అభివృద్ధికి అంచనాలు (ఎస్టిమేట్స్) సిద్ధం చేస్తే, తానే స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి నిధులు తీసుకువస్తానని అధికారులకు చెప్పినట్లు వివరించారు. వివాదాలు పక్కనబెట్టి అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.
