Kalvakuntla Kavitha : సీఎం రేవంత్, ధర్మపురి అరవింద్‌పై కవిత సంచలన కామెంట్స్.. ఆ వీడియో అందుకే రిలీజ్ చేశా..

Kalvakuntla Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు.

Kalvakuntla Kavitha

  • సీఎం రేవంత్, అరవింద్ పై కవిత కీలక కామెంట్స్
  • అవినీతి కోసం సీఎం ఫ్యూచర్ సిటీ
  • ధర్మపురి అరవింద్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు

Kalvakuntla Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ అవినీతి కోసం ఫ్యూచర్ సిటీ అంటున్నారని విమర్శించిన కవిత.. ధర్మపురి అరవింద్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Telangana RTC employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోంది.. అనేక గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలో కలిశాయి. హెచ్ఎండిఏ పరిధిలో 35వేల కోట్ల ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారు. కానీ 35వేల కోట్లను హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించలేదు.  హెచ్ఎండీఏకు చైర్మన్‌గా, వైస్ ఛైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. 2017 నుంచి 2021 వరకు 480కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం ఆయిన తర్వాత 1140 కోట్లను నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారు. ఇది ఆర్ధిక శాఖ నిబంధనలకు వ్యతిరేకమని కవిత అన్నారు. 50 కోట్ల టెండర్ వేస్తే దాదాపు 50శాతం తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.

నర్సరీ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్న 6వేల మంది స్కిల్డ్ లేబర్‌కు 23,800 రూపాయలు ఇవ్వాలి. ఔటర్ రింగ్ రోడ్డులోఒక కంపెనీపై సిట్ వేసిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఏమైందో చెప్పాలని కవిత అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టును ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్లానింగ్ డిపార్ట్మెంట్ పై దృష్టి పెడుతున్నారు. సీఎం దగ్గర బ్యాగులు మోసే ఆయన చెపితేనే పనులు అవుతున్నాయని కవిత అన్నారు. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రి పాలనలో జరుగుతున్న మహా అవినీతి. అవినీతి కోసం సీఎం ఫ్యూచర్ సిటీ అంటున్నారని కవిత  ఆరోపించారు.

ఈనెల 25 వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 కమిటీలు వేశాము. 500మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని కవిత చెప్పారు. మహిళా బిల్లు అమలు కాకపోవడంతో 12రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు నష్టపోయారు. 2027 జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నామని కవిత అన్నారు.

ధర్మపురి అరవింద్‌లో పురుష అహంకారం కనపడుతోంది. ధర్మపురి అరవింద్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారంటూ కవిత ఎద్దేవా చేశారు. నేను తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాను. నేను ఎవరో చెప్తే పార్టీ పెట్టే స్థాయిలో లేనని కవిత క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. కానీ, కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు కేరళ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని నేను వీడియో రిలీజ్ చేశానని కవిత చెప్పారు.