Kavitha : ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా..
Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- September 3, 2025 / 06:16 PM IST
Kavitha
Kavitha : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తరువాత తొలిసారి బుధవారం ఉదయం కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై కీలక కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తున్నానని కవిత తెలిపారు. నేను ఏ పార్టీలోనూ చేరను. ఇతర పార్టీల్లో చేరాల్సిన అవసరం నాకు లేదు. తొందరపడి నేను ఏ నిర్ణయం తీసుకోను. తెలంగాణ ప్రజలకు లాభం జరిగే నిర్ణయమే తీసుకుంటా. ఇక నా ప్రయాణం ప్రజలతోనే ఉంటుందని కవిత అన్నారు.
