×
Ad

అందుకే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడారు: మంత్రి ఉత్తమ్‌ రియాక్షన్

కూలిపోయేలా ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ సర్కారుపై ఇవాళ కేసీఆర్ చేసిన విమర్శలపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. కూలిపోయేలా ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.

ఇవాళ ఉత్తమ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణం కేసీఆర్. కాళేశ్వరం నిర్మాణ తీరును జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుబట్టారు. ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే వచ్చిన ఫలితం శూన్యం.

ఎస్‌ఎల్‌బీసీ, దిండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ అని అన్నారు. ఇప్పుడు తెలంగాణకు కాళేశ్వరం గుదిబండలా మారింది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చి కూడా కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోయారు” అని అన్నారు.