FSL Fire Accident : ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు.. ఎన్ని ఫైల్స్ దగ్దమయ్యాయి.. ఫైల్స్ రికవరీపై ప్రత్యేక బృందం ఏమన్నదంటే?
FSL Fire Accident : తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్) అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది.
- Harishth Thanniru
- Published On : February 21, 2026 / 09:55 AM IST
FSL Fire Accident
- ఎఫ్‌సీఎల్ అగ్ని ప్రమాదంలో ప్రత్యేక కమిటీ రిపోర్ట్
- 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగపూర్ బృందం వెల్లడి
- డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చిచెప్పిన ప్రత్యేక బృందం
FSL Fire Accident : తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్) అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో పలు ఫైల్స్ దగ్దమైనట్లు గుర్తించిన నాగపూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. డేటా రివకరీపై కీలక విషయాన్ని చెప్పింది. అగ్నిప్రమాదం ఘటనలో 1100 ఫైల్స్ దగ్దం అయినట్లు గుర్తించిన ప్రత్యేక బృందం.. డేటా రికవరీ కోసం ప్రయత్నించింది. అయితే, అనేక ప్రయత్నాల అనంతరం 1100 కేసుల డేటా రికవరీ సాధ్యం కాదని నాగపూర్ ప్రత్యేక బృందం తేల్చి చెప్పింది.
Also Read : Telangana Govt : తెలంగాణలోని మహిళలకు గుడ్‌న్యూస్.. మార్చి 1 నుంచి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ..
టీజీ ఎఫ్ఎస్ఎల్‌లో ఈనెల 7న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భవనం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు దగ్దమయ్యాయి. దాదాపు అనేక కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్ డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్దమవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. వివిధ కేసుల్లో దర్యాప్తులో ఎఫ్ఎస్‌ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కడ నేరం జరిగినా ఘటనా స్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్లు పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి పదార్థాల పరిశీలన జరుపుతారు. కోర్టు తీర్పుల్లో కూడా ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంత మేర పడనుందనేది ఆందోళనకరమైన విషయం.
