Komatireddy Rajagopal Reddy: వైఎస్ పాలనే మాకు ఆదర్శం.. త్వరలో బలమైన వేదిక.. కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్

తెలంగాణ రాజకీయం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కింది.

Komatireddy rajagopal reddy sensational comments on revanth government

  • త్వరలో భారీ రాజకీయ మార్పులు
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
  • వైఎస్సార్ పాలనే మాకు ఆదర్శం

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ రాజకీయం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో త్వరలోనే పెను రాజకీయ మార్పులు రాబోతున్నాయని, ప్రజల కోసం తానొక బలమైన వేదికను నిర్మించబోతున్నానని ఆయన ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన, ఒక సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చకు దారితీశాయి.

TTD: సాక్షాత్తు బ్రహ్మదేవుడు జరిపే దివ్య వేడుకలు.. తిరుమలలో బ్రహ్మోత్సవాల శోభ.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల తేదీలివే

రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు, సంక్షేమ వ్యవస్థలు ధ్వంసం:

రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టాయని, విద్యా రంగానికి కీలకమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేకపోతోందని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక చేతితో రైతు బంధు ఇస్తూ, మరో చేతితో గల్లీగల్లీలో ఉన్న బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు పెంచి ప్రజల డబ్బులు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రాజకీయాన్ని కేవలం వ్యాపారంగా మార్చుకుని, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా వచ్చిన వాళ్ళు శాశ్వతంగా నిలబడలేరని, అలాంటి వారు వ్యాపారాలు చేసుకోవచ్చని సొంత పార్టీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా నిప్పులు చెరిగారు.

వైఎస్సార్ ఆదర్శం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ:

తమకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శమని, కోమటిరెడ్డి(Komatireddy Rajagopal Reddy) బ్రదర్స్ ఎప్పటికీ ‘వైఎస్ టీమ్’ అని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ అందించిన స్వర్ణయుగ పాలనను ప్రజలకు మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని, అవసరమైతే నిజాయితీపరులు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. రాబోయే రాజకీయ మార్పుల్లో తన పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని తేల్చిచెప్పడం ద్వారా ఆయన త్వరలోనే కొత్త రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారనే సంకేతాలు ఇచ్చారు.