Konda Surekha: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సురేఖ కీలక భేటీ.. అధిష్ఠానానికి వివరణ ఇచ్చిన మంత్రి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha)ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Konda Surekha meets mallikarjun kharge in bengaluru explanation on remarks
- ఖర్గేతో సురేఖ కీలక భేటీ
- కూతురి వ్యాఖ్యలపై అందించిన వివరణ
- పార్టీపై విమర్శలు వద్దని సూచన
Konda Surekha: తెలంగాణ రాజకీయంలో చోటుచేసుకుంటున్న పరిణామాల వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద ముఖ్యమైన భేటీ జరిగింది. బెంగుళూరు నగరం వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha)ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, వ్యాఖ్యలపై తీవ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం.
NMMS Scholarship: విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. రూ. 48,000 స్కాలర్షిప్.. ఇవాళే లాస్ట్ డేట్
కూతురు వ్యాఖ్యలపై వివరణ, గాంధీ ఫ్యామిలీపై గౌరవం ఉందన్న సురేఖ:
తన కుమార్తె చేసిన వ్యాఖ్యల వివాదంపై పార్టీ అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై ఇదివరకే రెండుసార్లు వివరణ ఇచ్చానని ఖర్గేకు సురేఖ గుర్తుచేశారు. గాంధీ కుటుంబంపైగానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైగానీ తనకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది.
రాష్ట్ర కాంగ్రెస్‌కే వివరణ ఇవ్వాలి, ఖర్గే కీలక సూచనలు:
కొండా సురేఖ ఇచ్చిన వివరణపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందిస్తూ పలు కీలక సూచనలు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కే పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ చాలా ముఖ్యమని, బహిరంగంగా పార్టీపై లేదా నాయకత్వంపై విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఖర్గే మంత్రికి హితవు పలికారు.
