KTR: ఉత్తుత్తి బాంబులకు ఎవరూ భయపడరు.. పొంగులేటి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

KTR

KTR Counter to Ponguleti: ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబు పేలుతుందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాజాగా పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. ఈ ఉత్తుత్తి బాంబులకు ఎవరూ భయపడరని కౌంటర్ ఇచ్చారు. కేసులు పెడతారా పెట్టుకోండి.. మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడమని కేటీఆర్ అన్నారు.