రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? ట్విట‌ర్ వేదిక‌గా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

ప‌దేళ్ల బీఆర్ ఎస్ పాల‌న‌లో రైతుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా విత్త‌నాలు పంపిణీ చేశాం. కానీ, కాంగ్రెస్ హ‌యాంలో ..

KTR

KTR questioned To Telangana Government : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

Also Read : దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారు- సీఎం రేవంత్ రెడ్డి

ప‌దేళ్ల బీఆర్ ఎస్ పాల‌న‌లో రైతుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా విత్త‌నాలు పంపిణీ చేశాం. కానీ, కాంగ్రెస్ హ‌యాంలో విత్త‌నాల‌కోసం రైతులు వెత‌లు ప‌డుతున్నారు. ప‌ర్య‌వేక్షించాల్సిన వ్య‌వ‌సాయ మంత్రి ఎక్క‌డ‌? ముందుచూపు లేని ముఖ్య‌మంత్రి జాడేది? అంటూ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆగం చేశారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి. బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండ‌ని కేటీఆర్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.

Also Read : తెలంగాణ గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీదే .. విద్యుత్ కోతలపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్ ట్వీట్ ప్ర‌కారం..
బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా ??

ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!
బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండి..!!
విత్తనాలకోసం రైతులకు ఏమిటీ వెతలు ??

పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?
ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??

ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..
ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ??

నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!
నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!!

పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి..
ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ??

సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..
ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా ??

తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే..
సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా ??

గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు..
10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ??

రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..
రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..

దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ..
అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ??

బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా ??

ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!
బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండి..!!

కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న..
అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!!

లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని..
కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!

 

 

ట్రెండింగ్ వార్తలు