×
Ad

సజ్జనార్ ఏమీ జడ్జి కాదు.. ఇక చూస్కో.. కేటీఆర్ హాట్ కామెంట్స్

"ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదు. సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు" అని అన్నారు.

Sajjanar, KTR (Image Credit To Original Source)

  •  నిన్న ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మాకు గుర్తొచ్చింది
  • మేడారం జాతర ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
  • సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు

KTR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మలను తగలబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.

“నిన్న ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మాకు గుర్తొచ్చింది. మమ్మల్ని తట్టి లేపిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. నిన్న కేసీఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదు. చట్టం అంటే కేసీఆర్ కు గౌరవం, అందుకే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న మా ఇంటి చుట్టూ వెయ్యి మంది పోలీసులను పెట్టారు. లా అండ్ ఆర్డర్ పై పోలీసులు దృష్టి పెడితే బాగుంటుంది.

ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మంత్రి వాహనంపై దాడి జరగడం మొదటిసారి.

Also Read: క్షణాల వ్యవధిలో ఆ 50 మందిని చంపేసింది ఈ ఇద్దరు అమ్మాయిలే..

ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదు. సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు. హరీశ్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలి. సజ్జనారైనా, ఇంకో అధికారైనా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్లాలి కదా? సజ్జనార్ జడ్జి కాదు, పోలీస్ అధికారి మాత్రమే. మరి ఈ మధ్య కాలంలో సజ్జనార్ జడ్జి అయ్యారేమో నాకైతే తెలియదు.

సుల్తాన్ బజార్ లో పట్టపగలే ATM దగ్గర చోరి జరిగింది. నల్లమల సాగర్ తో నీళ్ల దోపిడీ జరుగుతుంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి సాయంత్రానికి ఢిల్లీ వెళ్లారు. సింగరేణి కుంభకోణం బయట పెట్టాలి.

సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చారో వివరాలు బయట పెట్టాలి. సృజన్ రెడ్డి కాల్ డేటాను బయట పెడితే వాస్తవాలు తెలుస్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రౌడీలను వేసుకుని తిరుగుతున్నాడు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడుకి పరిచయ కార్యక్రమం ఉంటే రాష్ట్రానికి రావొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. మేము ఎవరినీ బ్లాక్ మెయిల్ చేశామో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పాలి. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి” అని అన్నారు.