తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది. ఈ కార్డుల పంపిణీ జూన్ 2 నుండి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నారు. ఇందుకుగాను వారు తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్‌కు చూపించాలి. స్మార్ట్ కార్డులు జారీ చేసిన తర్వాత, వాటి ద్వారానే ఉచిత ప్రయాణం చేయొచ్చు.
కాగా, తెలంగాణలో మహాలక్ష్మి పథకం.. మహిళల సామాజిక, ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి. ముఖ్యంగా ప్రజా రవాణా సౌకర్యాన్ని సులభంగా, ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మహిళలు రోజువారీ ప్రయాణాల్లో ఎదుర్కొనే ఆర్థిక భారం తగ్గించడం, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం వంటి అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.