Mahesh Bhagwat: హైదరాబాద్ కొత్త సీపీగా మహేష్ భగవత్ బాధ్యతలు.. శాంతిభద్రతలు, మహిళా భద్రతకే తొలి ప్రాధాన్యత అంటూ వ్యాఖ్య
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్(Mahesh Bhagwat) బాధ్యతలు స్వీకరించారు.
- V Santhosh Kumar
- Published on- November 13, 2026 / 01:48 PM IST
Mahesh Bhagwat has taken charge as the new CP of Hyderabad.
Mahesh Bhagwat: భాగ్యనగర పోలీసు బాస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్(Mahesh Bhagwat) అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో విధుల్లో చేరిన ఆయన, ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలకు తమ బృందం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఏటా 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, హైదరాబాద్‌లోని అనుభవజ్ఞులైన అధికారులందరితో కలిసి సమష్టిగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
భూ తగాదాలు, పాత నేరస్థులపై పీడీ యాక్ట్‌లు తప్పవు:
మరోవైపు నగరంలో భూముల విలువలు భారీగా పెరగడం వల్ల స్థల వివాదాలు, దాడులు ఎక్కువవుతున్నాయని, అటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ మహేష్ భగవత్ హెచ్చరించారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు కఠినంగా పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని, నేరం చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా చూస్తామని నగర ప్రజలకు భరోసా ఇచ్చారు.
