Mahesh Kumar Goud : కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం : మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్ అమిత్ షా ని కలిసి వారికీ అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షుడిగా మార్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకని విమర్శించారు.

Mahesh Kumar Goud (1)

Mahesh Kumar Goud  Counter : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నియామకం బీజేపీకి వెనుకబడిన తరగతుల నాయకులపై ప్రేమను స్పష్టం చేస్తుందన్నారు. బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ గత 3 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.

సున్నా శాతం ఉన్న బీజేపీ 1-2 శాతనికి వచ్చిందన్నారు. బీసీ నాయకుల పార్టీ అని చెప్పుకునే బీజేపీకి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు నియామకంతో స్పష్టం అవుతుందని తెలిపారు. కేసీఆర్ కోరిక మేరకే కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడు చేసినట్లు స్పష్టం అవుతుందన్నారు.

Eatala Rajender : అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తి వేస్తాం, రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం : ఈటల రాజేందర్

కేటీఆర్ అమిత్ షా ని కలిసి వారికీ అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షుడిగా మార్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు