Konda Surekha : రాజీనామా చేయండి.. కొండా సురేఖకు ఖర్గే ఆదేశం..!
Konda Surekha : మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుండి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
- Harish Thanniru
- Updated on- September 3, 2026 / 12:19 PM IST
Konda Surekha
Konda Surekha : మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుండి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు రాజీనామా చేయాలని డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. ఒకవేళ రాజీనామా చేయకుంటే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. లేకుంటే గవర్నర్‌కు లేఖ రాసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ఈలోపు కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయకుంటే.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలుపై దృష్టిసారించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కొండా సురేఖ రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో మధ్యాహ్నం తరువాత తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె ఎలాంటి ప్రకటన చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
