×
Ad

Telangana : కారులో పడేసి వ్యక్తి సజీవ దహనం..సగం కాలిన బాడీ చూసి హడలిపోయిన స్థానికులు

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో ఓ కారులో సగం కాలిన మృతదేహం తీవ్ర కలకలం రేపింది. కారులో సగం కాలిన మృతదేహం కనిపించటం సంచలన కలిగించింది. కారు డోరులోనుంచి సగంకాలిన మృతదేహం కాలు బయటకు కనిపించటంతో స్థానికులు హడలిపోయారు. ఆ కారు వద్ద ఒక బ్యాగు, ఆ పక్కనే ఉన్న పొదల్లో ఓ పెట్రోల్ క్యాను కనిపించింది

  • Published On : January 9, 2023 / 03:46 PM IST

Man burns alive in car.. venkatapuram suburb of medak district

Telangana : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో ఓ కారులో సగం కాలిన మృతదేహం తీవ్ర కలకలం రేపింది. కారులో సగం కాలిన మృతదేహం కనిపించటం సంచలన కలిగించింది. కారు డోరులోనుంచి సగంకాలిన మృతదేహం కాలు బయటకు కనిపించటంతో స్థానికులు హడలిపోయారు. ఆ కారు వద్ద ఒక బ్యాగు, ఆ పక్కనే ఉన్న పొదల్లో ఓ పెట్రోల్ క్యాను కనిపించింది. దీంతో ఎవరో వ్యక్తిని కారులో పడేసి సజీవంగా దహనం చేశారని అనుమానించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు? ఎవరన్నా హత్య చేసిన ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేశారా?లేక సజీవంగా దహనం చేశారా? అనే కోణంలో టేక్మాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాల కోసం ఆరా తీయగా ధర్మా అనే వ్యక్తిగా గుర్తించారు.

అనుమానాస్పద స్థితిలో కారులో భీమ్లా తండాకు చెందిన ధర్మా అనే వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్ సెక్రటెరియట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 48 ఏళ్ల ధర్మా జనవరి 5న కుటుంబ సభ్యులతో స్వగ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాత కారులో సజీవదహనమయ్యాడు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని చూసిన పోలీసులు ధర్మ ఎలా చని పోయాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కారు వద్ద ఓ బ్యాగ్‌ను పొదల్లో పెట్రోల్‌ డబ్బాను గుర్తించారు. ఆత్మహత్యా, లేదంటే హత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలను దర్యాప్తు తరువాత వెల్లడిస్తామని తెలిపారు.