Karimnagar Robbery: కరీంనగర్‌లో దారుణం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. కోటిన్నర సొత్తు కాజేశారు
కరీంనగర్ నగరంలో మరోసారి భారీ దోపిడీ (Karimnagar Robbery)కలకలం సృష్టించింది.
- V Santhosh Kumar
- Published on- July 22, 2026 / 09:39 AM IST
Massive robbery took at Bharat Nagar in Karimnagar
- కరీంనగర్‌లో భారీ దారి దోపిడీ
- తుపాకులు చూపి బెదిరించిన దొంగలు
- కోటిన్నర విలువైన సొత్తు అపహరణ
Karimnagar Robbery: కరీంనగర్ నగరంలో మరోసారి భారీ దోపిడీ కలకలం సృష్టించింది. గతంలో జరిగిన పిఎంజె షాప్ రికార్డు దోపిడీ మరువక ముందే, సరిగ్గా అదే తరహాలో దొంగలు విరుచుకుపడ్డారు. పట్టపగలు లాంటి రాత్రి వేళ భగత్ నగర్‌లోని ఒక ఇంట్లోకి ఆయుధాలతో ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. భగత్ సింగ్ చౌరస్తా వద్ద నివాసముంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇల్లు ప్రధాన లక్ష్యంగా మారింది.
Lift Safety Act: తెలంగాణలో ‘లిఫ్ట్ చట్టం’.. ముసాయిదా బిల్లు సిద్ధం.. త్వరలోనే అసెంబ్లీకి
లైట్లు ఆర్పేందుకు కిందకు వెళ్లిన వృద్ధుడిని దారిలోనే పట్టుకున్న దుండగులు(Karimnagar Robbery), ఇంట్లోని మహిళలతో సహా అందరినీ తీవ్రంగా కొట్టి, తుపాకులు, కత్తులతో చంపుతామని బెదిరించారు. అనంతరం వారిని బంధించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.21 లక్షల నగదుతో పాటు ఫోన్లను ఎత్తుకెళ్లారు. చివరికి పార్కింగ్‌లోని రెండు బైక్‌లపై వేములవాడ బైపాస్ మీదుగా పరారయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. బాధిత యజమాని అజ్మత్ అలీ తన పెద్ద అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఉత్తరాదికి చెందిన హిందీ భాషలో మాట్లాడారని, యుపికి చెందిన తన అల్లుడే ఈ కుట్ర పన్ని ఉండవచ్చని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు మాత్రమే ఇంట్లో ఉన్నారని తెలుసుకుని పక్కా ప్లాన్‌తోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
