Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ కు ఊహించని షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ.. కారణం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు రాజకీయంగా ఊహించని పెద్ద షాక్ తగిలింది.
Meenakshi natarajan rajya sabha nomination rejected madhya pradesh 2026
- మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
- అఫిడవిట్లో కేసుల వివరాలు దాచడంతో షాక్
- రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన భాజపా
Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు రాజకీయంగా ఊహించని పెద్ద షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ను అక్కడి ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపగా.. ప్రత్యర్థి పార్టీలకు గట్టి ఆయుధంగా మారింది.
రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్.. తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో పూర్తిగా వెల్లడించకుండా దాచిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై నిశితంగా పరిశీలించిన భారతీయ జనతా పార్టీ (భాజపా) నేతలు, ఆమె ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను మరుగునపరిచారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆధారాలతో సహా అధికారికంగా ఫిర్యాదు చేశారు.
భాజపా ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారి, అఫిడవిట్ నిబంధనల ఉల్లంఘన నిజమేనని నిర్ధారించుకుని ఆమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కీలకమైన ఎన్నికల సమయంలో కేసుల వివరాలు దాచడం వల్ల జరిగిన ఈ పరిణామం మీనాక్షి నటరాజన్‌తో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర రక్షణలో పడేసింది.
