Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Meteorological Centre announced heavy rains across Telangana for next three days.

  • తెలంగాణలో భారీ వర్షాల సూచన
  • పలు జిల్లాలకు అలర్ట్ జారీ
  • హైదరాబాద్‌లో మోస్తరు వర్షాల అవకాశం

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ (Telangana Rains)నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడి, పలు ప్రాంతాల్లో చినుకులు ప్రారంభమయ్యాయి. రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.

PM Modi Gold: బంగారం కొనకండి.. విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు

జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు: ఆ ప్రాంతాల్లో జాగ్రత్త:

రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్’, ‘యెల్లో’ అలర్ట్‌లను జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను వాతావరణం నెలకొంటుందని స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

హైదరాబాద్‌ లో వాతావరణం, నేరుగా గ్రేటర్ వ్యాప్తంగా జల్లులు:

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే 72 గంటల పాటు ఆకాశం మబ్బుపట్టి ఉంటుందని, నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో కొన్ని చోట్ల భారీ వర్షం పడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చని జీహెచ్‌ఎంసీ డ్రోన్, మాన్సూన్ అత్యవసర బృందాలను రంగంలోకి దించింది. డ్రైనేజీలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.