Telangana Rains: తెలంగాణలో హఠాత్తుగా మారిన వాతావరణం.. రెండురోజులు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరికలు!

తెలంగాణాలో (Telangana Rains)రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Meteorological Centre issued possibility of rain in Telangana for next two days.

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అకస్మాత్తుగా రూపురేఖలు మార్చుకుంటోంది. భానుడి ప్రతాపంతో పాటు స్థానిక వాతావరణ మార్పుల కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అకాల వర్ష సూచనల నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని రైతాంగం, గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

Vijayawada-Somnath Special Train: విజయవాడ టూ సోమనాథ్ స్పెషల్ ట్రైన్.. 1,060 మంది భక్తులకు ఉచిత యాత్ర.. జెండా ఊపిన బొండా ఉమా

ఉత్తర, తూర్పు తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈదురు గాలుల ముప్పు:

ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు(Telangana Rains) పడే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వేగవంతమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున వర్షం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు.

మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం.. పిడుగుల పట్ల జాగ్రత్త:

వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే కొన్ని చోట్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే ముప్పు ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షితమైన కాంక్రీట్ భవనాల నీడలోకి వెళ్లాలని అధికారులు కోరారు. మారిన ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరమని హెచ్చరించారు.