Telangana Rains: తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు.. హైదరాబాద్ ప్రజలు జాగ్రత్త!
తెలంగాణ(Telangana Rains)లో రాగల రెండు రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Meteorological Department announced there possibility of heavy rains in Telangana for next two days.
Telangana Rains: తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల కారణంగా ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
AP High Court: గ్రూప్-1 కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. ‘సిట్’ ఆధార పత్రాలు ఇవ్వాలని ఉత్తర్వులు
హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు:
రాజధాని హైదరాబాద్‌తో పాటు జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితేనే బయటకు రావాలని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వర్షపాతం హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.
వివిధ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ:
వర్ష తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌లను జారీ చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే వీలుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
