Telangana Rains : తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
Telangana Rains : నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతం మధ్య ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి విదర్భ వరకూ 900 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- June 11, 2026 / 06:13 AM IST
Telangana Rains
- తెలంగాణకు రెయిన్ అలర్ట్
- నేటి నుంచి మూడు రోజులు మోస్తరు వర్షాలు
- నాలుగు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరణ
Telangana Rains : తెలంగాణలో ఒకవైపు ఎండలకుతోడు మరోవైపు వర్షాలు దంచికొడుతున్నారు. నైతి రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో కాస్త వాతావరణం చల్లబడింది. రుతుపవనాలు క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలకుతోడు బంగాళాఖాతం మధ్య ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి విదర్భ వరకూ 900 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నేటి (గురువారం) నుంచి మూడు రోజులుపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేరొంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, ఉమ్మడి నల్గొండ జిల్లాలతోపాటు పిలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.
వచ్చే మూడు రోజులు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
